ఆ సమయంలో మహిళల కోసం ఆటోలు నడపండి : మంత్రి కేటీఆర్

 ఆ సమయంలో మహిళల కోసం ఆటోలు నడపండి : మంత్రి కేటీఆర్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే మంత్రి కేటీఆర్.. సామాజిక సమస్యలపైనా చర్చిస్తూ.. ప్రజల సమస్యలు తీర్చడంలోనూ ముందుంటారు. తాజాగా  ఓ మహిళా ప్రయాణికురాలు చేసిన ట్వీట్ పై మంత్రి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని హర్షిత అనే ట్విట్టర్ యూజర్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.

 ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆమె కోరిన సమయంలో మహిళలకు పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్ కు సూచించారు. ట్రాకింగ్ మెకానిజంతో ఆటోలు ఏర్పాటు చేయాలని, ఈ పద్దతినే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని చెప్పారు. ఈ సూచనపై డీజీపీ అంజనీ కుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా వారికి రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.