రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా లీడ్ రోల్స్‌లో రాజేష్ జగన్నాధం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. ఏ స్వీట్ రైవల్రీ అనేది ట్యాగ్ లైన్. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ట క్లాప్ కొట్టగా మరో దర్శకుడు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు.
డైరెక్టర్ అనుదీప్ గౌరవ దర్శకత్వం వహించాడు. వీఎస్‌కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నాడు. రమీజ్ నవనీత్ సినిమాటోగ్రాఫర్. రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
