మీ కూతురి వీడియోలు నా దగ్గరున్నాయి.. దమ్ముంటే కేసు పెట్టుకోండి

మీ కూతురి వీడియోలు నా దగ్గరున్నాయి.. దమ్ముంటే కేసు పెట్టుకోండి

‘మీ కూతురి వీడియోలు, ఫోటోలు నా దగ్గరున్నాయి’ అని యువతి తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌కి చెందిన అట్లూరి సురేష్ ఈ బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. డబ్బున్న వారిని టార్గెట్ చేసి.. సురేష్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. పైగా దమ్ముంటే కేసు పెట్టుకోండి అని హెచ్చరిస్తుంటాడు. ఇప్పటివరకు సురేష్‌పై ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. గతంలో సురేష్ ఓ కేసులో అరెస్ట్ అయినప్పుడు బంజారాహిల్స్ పోలీసులపైనే ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టాడు. ఇప్పుడు అడ్డంగా దొరకడంతో సరేష్ బాగోతం బయటపడింది.