- సీజేఐ పై దాడి.. 30 కోట్ల దళితులపై జరిగిన దాడిగానే చూస్తాం: మంద కృష్ణ మాదిగ
న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి దేశంలోని 30 కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. దళితుల మీద దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమన్నారు.
సీజేఐ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ‘దళితుల ఆత్మగౌరవ సభ’ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ‘చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్తుంటే.. అందుకు విరుద్ధంగా చట్టపరమైన వ్యవస్థలు దళితులపై దాడులకు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవడం లేదు’ అని అన్నారు. ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.
