
బషీర్బాగ్, వెలుగు: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై రాకేశ్ కిషోర్ చేసిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా రిటైర్డ్ ఐపీఎస్, సివిల్ రైట్స్ ఇంటియేటివ్ ఇంటర్నేషనల్(సీఆర్ ఐఐ) జాతీయ అధ్యక్షుడు కె.బాబురావు అభివర్ణించారు. దళితుడు కాబట్టే గవాయిపై దాడి జరిగిందన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివిధ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందుత్వం ముసుగులో కొన్ని శక్తులు దేశంలో ఆరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని పాల్గొన్నారు.