నవ్వుదాం.. నవ్విద్దాం.. నవ్వులు పంచుదాం .. జీహెచ్‌ఎంసీ పార్కులో లాఫింగ్‌ డే వేడుకలు

నవ్వుదాం.. నవ్విద్దాం.. నవ్వులు పంచుదాం .. జీహెచ్‌ఎంసీ పార్కులో లాఫింగ్‌ డే వేడుకలు

గండిపేట,వెలుగు: అత్తాపూర్‌ డివిజన్‌ లక్ష్మీనగర్‌ జీహెచ్‌ఎంసీ పార్కులో సోమవారం స్థానిక యోగా సెంటర్‌ ఆధ్వర్యంలో ‘లాఫింగ్‌ డే’ నిర్వహించారు. యోగా అభ్యాసకులు, వాకర్లు పాల్గొని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. డాక్టర్లు కాళీ వరప్రసాద్, సీతారామ్​మాట్లాడుతూ నవ్వు మానసిక ధైర్యానికి.. ఆత్మవిశ్వాసానికి సాధనం అన్నారు.

 నవ్వుతో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. యోగా గురువు బి.సుధాకర్, ప్రొఫెసర్‌ రాఘవరెడ్డి, తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య పాల్గొన్నారు.