టెన్త్ ఎగ్జామ్స్.. తొలిరోజు 99% హాజరు

టెన్త్ ఎగ్జామ్స్..  తొలిరోజు 99% హాజరు
  • రెండేండ్ల తర్వాత మొదలైన ప్రత్యక్ష పరీక్షలు
  •  5,08,143 మందికి గాను 5,03,041 మంది అటెండ్​
  •  5,102 మంది గైర్హాజరు

హైదరాబాద్,వెలుగు: పదో తరగతి పరీక్షలు  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కావడంతో  అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.  సోమవారం ఫస్ట్ లాంగ్వేజీ ఎగ్జామ్ కు మొత్తం 99% స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ స్టూడెంట్లు 5,08,143 మందికి గానూ 5,03,041 మంది హాజరయ్యారు. 5,102 మంది అటెండ్ కాలేదు. ప్రైవేటు స్టూడెంట్లు 158 మందికి గానూ 89 మందే హాజరయ్యారు. తొలిరోజు మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదు. ఉదయం 8గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద సందడి మొదలైంది. తొలిరోజు తెలుగు పేపర్ ఈజీగా వచ్చిందని స్టూడెంట్లు, టీచర్లు చెప్పారు. గతంలో పేపర్​లో  క్వశ్చన్లు అర్థం కాకుండా ఇచ్చే వారనీ, స్టూడెంట్లు కొంత ఆలోచించాల్సి వచ్చేదని కామారెడ్డి జిల్లాకు చెందిన తెలుగు పండిట్​ఒకరు చెప్పారు. ఈ సారి పుస్తకాల్లో ఉన్న అంశాలనే డైరెక్ట్​గా క్వశ్చన్లుగా ఇచ్చారని, ఛాయిస్​ కూడా ఎక్కువగా ఇచ్చారని ఆయన తెలిపారు.