ఆఫీసులో సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చుంటున్నారు

ఆఫీసులో సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చుంటున్నారు

రెండు నెలలుగా వీఆర్వోలు ఖాళీ

రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులూ..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వీఆర్వో వ్యవ స్థ రద్దయి 2 నెలలు ముగిసింది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో పని చేసిన వారు ఇక నుంచి ఏ శాఖలో, ఏం పని చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదు. 7,039 వీఆర్వో పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆ టైమ్‌ కు రాష్ట్రంలో 5,086 మంది వీఆర్వోలు ఉన్నారు. వీరంతా ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి హాజరు వేసుకుని వస్తున్నారు. కొందరు ఖాళీగా ఉంటుండగా, మరికొందరు తహసీల్దార్ లు చెప్పిన పని చేస్తున్నారు. వీఆర్వోల వ్యవస్థ రద్దం టే ఉద్యోగాలు తీసేసినట్లు కాదని, వారి ఉద్యోగాలు ఎటూ పోవని ప్రకటించిన ప్రభుత్వం ఇక నుంచి వాళ్లు ఏం చేయాలో చెప్పడం లేదు. నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష న్ల శాఖ ఆఫీసర్లు, స్టాఫ్ రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు.