ఖైరాతాబాద్ భాస్కర ఆడిటోరియంలో ఆదివారం ‘నవ జనార్ధన పారిజాతం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నర్తనశాల తరఫున సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పునరావిష్కరించి, లిఖితరూపం ఇచ్చిన ఈ నృత్యరూపకాన్ని ఆయన శిష్యుడు కళాకృష్ణ నృత్య దర్శకత్వం వహించారు.
