హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్.. 16, 17 తేదీల్లో ఆన్లైన్ ఆక్షన్

హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్.. 16, 17 తేదీల్లో ఆన్లైన్ ఆక్షన్

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు పరిధిలో చందానగర్( హైదరాబాద్) , కరీంనగర్​లో ఖాళీగా ఉన్న కమర్షియల్ జాగాలను వేలం వేయనుంది. చందానగర్​లో మూడుచోట్ల 2,593 గజాలు, 1,809 గజాలు, 2,716 గజాల భూమికి ఈ నెల16న, కరీంనగర్​లోని 4,335 గజాలు, 3,025 గజాల భూమికి ఈ నెల 17న హౌసింగ్ బోర్డు వేలం వేయనుంది. 

చందానగర్ ప్లాట్లకు గజం రూ.40 వేలు, కరీంనగర్​లో ప్లాట్లకు రూ.30 వేలుగా ఖరారు చేశారు. ఈ నెల 9న హిమాయత్ నగర్​లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్​లో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తున్నామని, ఈ నెల15వరకు వేలంలో పాల్గొనేవాళ్లు ఆన్ లైన్​లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని బోర్డు ఎండీ వీపీ గౌతమ్ కోరారు.