స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ ఆమె నటిస్తోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌తోపాటు తన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో శ్లోక పాత్రలో రాశీఖన్నా కనిపించనుందని రివీల్ చేశారు.
మెడలో స్టిల్ కెమెరాతో చిరు నవ్వులు చిందుస్తున్న ఆమె పోస్టర్ ఆకట్టుకుంది. ఇప్పటికే రాశీ ఖన్నాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్‌గా రాశీ ఖన్నా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.
