పద్మారావునగర్/ మల్కాజిగిరి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో టైపిస్టు, స్టెనోగ్రాఫర్లకు అవకాశం కల్పించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోయినపల్లి సౌజన్య కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆదివారం గుర్తింపు పొందిన టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. అధ్యక్షుడు సతీశ్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పదిహేనేళ్లుగా టైపిస్టులు, స్టెనోగ్రాఫర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో పాటు పోస్టులను పెంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేశం, శశిధర్, రామేశ్వరచారి, రామారావు, వివేక్, రాజేశ్వర్, ఫణి, రాధ, నాగశ్రీ, నరేశ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
