కుటుంబ నేపథ్యంలో.. సః కుటుంబనాం.. డిసెంబర్ 12న రిలీజ్

కుటుంబ నేపథ్యంలో.. సః కుటుంబనాం.. డిసెంబర్ 12న రిలీజ్

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా  బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘సఃకుటుంబానాం’.  ఉదయ్ శర్మ  దర్శకత్వంలో  మహదేవ్ గౌడ్, నాగరత్న  నిర్మించారు.  డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.  అతిథిగా హాజరైన దర్శకుడు బుచ్చిబాబు సాన సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. బ్రహ్మానందం  మాట్లాడుతూ ‘ఇందులో  నా పాత్ర చాలా చిత్రంగా ఉండబోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు  మంచి విజయాన్ని  అందించి  టీమ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలవాలని కోరుతున్నా’ అని అన్నారు.   

రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ  ‘ఒక కొత్త పాత్రతో  దర్శకుడు నన్ను కలిశాడు.  ఇలాంటి  కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. అంత ప్రత్యేకంగా ఉండబోతుంది.  ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న ఈ  చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు  నచ్చుతుంది’ అని చెప్పారు. 

సీనియర్ ఆర్టిస్టులతో నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని హీరో రామ్ కిరణ్ అన్నాడు. ఈ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.