పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌‌తో స్పిరిట్.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్‌ రేసులో..

పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌‌తో స్పిరిట్.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్‌ రేసులో..

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం రీసెంట్‌‌గా పూజా కార్యక్రమాలతో  ప్రారంభం కాగా, రెగ్యులర్ షూటింగ్‌‌ను కూడా స్టార్ట్ చేశారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగిన టీమ్  గ్యాప్ లేకుండా షూటింగ్‌ను కొనసాగించాలనుకుంటోంది. ప్రభాస్ కూడా ఈ మూవీ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. కంటిన్యూగా రెండు నెలలపాటు ఈ సినిమా కోసమే తన టైమ్ కేటాయించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌ స్కోరు సిద్ధం చేసిన సందీప్ రెడ్డి వంగా షూటింగ్ విషయంలోనూ పర్ఫెక్ట్‌‌‌ ప్లానింగ్‌తో ఉన్నాడట.

గ్రాఫిక్ వర్క్ కూడా పెద్దగా లేకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైమ్ తీసుకునేలా లేరు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్‌ రేసులో సినిమా ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్- వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న  ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. 

త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టీ- సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని  విడుదల చేయబోతున్నారు.