మల్టీ స్టారర్ మాస్ డ్యాన్స్.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో చిరు, వెంకీ స్టెప్పులు

మల్టీ స్టారర్ మాస్ డ్యాన్స్.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో చిరు, వెంకీ స్టెప్పులు

ఇద్దరు  స్టార్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తే వారి అభిమానులకు అది పండుగే. టాలీవుడ్‌లో అలాంటి  క్రేజీ కాంబినేషనే చిరంజీవి, వెంకటేష్.  చిరు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ ఓ ఇంటరెస్టింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోపై  ఇంపార్టెంట్ సీన్స్‌‌ను చిత్రీకరించారు. తాజాగా వీరి  కలయికలో అదిరిపోయే మాస్ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గచ్చిబౌలిలో చిరంజీవి, వెంకటేష్‌‌‌‌‌‌‌‌లపై  స్టైలిష్ డ్యాన్స్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదివారం ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు.

భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్‌‌‌‌‌‌‌‌తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని రూపొందిస్తున్నారు.  విజయ్ పొలాకి కొరియోగ్రఫీ చేస్తున్న  ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ మల్టీస్టారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  మాస్ మూమెంట్స్ ప్రేక్షకులను, అభిమానులను కనువిందు చేయడం ఖాయంగా తెలుస్తోంది. నయనతార హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై  సాహు గారపాటి,  సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.