టాలీవుడ్‌లోకి మరో చిత్ర నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్’ పేరుతో నిర్మాత అతీకూర్ రెహమాన్ కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్‌పై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు. సమాజానికి ఉపయోగపడే, సామాజిక రుగ్మతలు, నేరాలపై యువతకు అవగాహన కల్పించేలా సినిమాలు నిర్మిస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఆదివారం ఈ బ్యానర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటి మహతి రెహమాన్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ బ్యానర్ లో ఎన్నో మంచి చిత్రాలు రావాలని అన్నారు.
