పెద్దపల్లి జిల్లాలో ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆదివారం కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్​వెంకటస్వామి 68వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు టిఫిన్​అందించారు. 

ఎస్సీ హాస్టల్​ విద్యార్థులకు బ్లాంకెట్స్​పంపిణీ చేశారు. ఓదెల మల్లన్న ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్​ నాయకులు కేక్​ కట్ చేశారు. నాయకులు సయ్యద్ సజ్జాద్, బూషనవేని రమేశ్, బొంకూరి కైలాసం, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్​పటేల్, అల్లం సతీశ్, కొండి సతీశ్, ఐలయ్య యాదవ్, అడ్డగుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి

గోదావరిఖని, వెలుగు:  మంత్రి వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని గోదావరిఖని కాంగ్రెస్​ సీనియర్ లీడర్, లయన్స్ క్లబ్​రీజినల్​చైర్మన్​ పి.మల్లికార్జున్​ఆకాంక్షించారు. ఆదివారం విఠల్​నగర్ లోని అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో కాంగ్రెస్ లీడర్​క్యామ విజయ్ ఆధ్వర్యంలో మంత్రి బర్త్​డే జరిపారు. 

కేక్​ కట్​ చేసి, పిల్లలకు పండ్లు, బ్రెడ్​పంపిణీ చేశారు. లీడర్లు కల్వల సంజీవ్, మల్లేశ్​యాదవ్, తిప్పారపు మధు, సురేందర్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం లయన్స్​క్లబ్​ఆధ్వర్యంలో లక్ష్మినగర్​ లేబర్​అడ్డా వద్ద దినసరి కూలీలకు టిఫిన్, నిరుపేదల మహిళలకు చీరలు, బ్లాంకెట్లను లయన్స్ డిస్ట్రిక్ట్​మాజీ గవర్నర్​ప్రమోద్​కుమార్​ రెడ్డి, జోన్​ చైర్మన్​ కె.రాజేందర్ పంపిణీ చేశారు. 

గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేశ్​ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ సీనియర్​లీడర్లు గుమ్మడి కుమారస్వామి, బాబర్​ సలీంపాషా, పి.మల్లికార్జున్ తదితరులు కేక్​ కట్ చేశారు. ఎన్టీపీసీ జ్యోతినగర్​లోని సాయిసేవా సమితి కేంద్రంలో ఐఎన్​టీయూసీ సీనియర్​ నేషనల్ సెక్రటరీ బాబర్​ సలీంపాషా ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. 

లలితమాత ఆలయంలో పూజలు

జగిత్యాల రూరల్, వెలుగు: మంత్రి వివేక్ బర్త్​డే సందర్భంగా ఆదివారం పొలాసలోని 108 శ్రీచక్ర సహిత లలితమాత ఆలయంలో మాజీ సర్పంచ్ ఎన్నం  కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు గంగారాం, మహేశ్, వనిత, స్వప్న, రోజా, భాగ్య, అపర్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధే మంత్రి, ఎంపీ ధ్యేయం

మంథని, వెలుగు: అభివృద్ధే ధ్యేయంగా మంత్రి వివేక్​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ పని చేస్తున్నారని జాతీయ మాలమహానాడు పెద్దపెల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాల పోచమల్లయ్య అన్నారు. ఆదివారం మంత్రి బర్త్​డే సందర్భంగా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. నాయకులు నూకల బానయ్య, కందుగుల రాజయ్య, ఎడ్ల కిష్టయ్య తదితరులున్నారు. 

ధర్మారం మండల కేంద్రంలో.. 

ధర్మారం, వెలుగు:  మండల కేంద్రంలోని అంబేద్కర్​చౌరస్తాలో మంత్రి వివేక్​బర్త్​డేను కాంగ్రెస్ సీనియర్​నాయకుడు కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్​కట్​చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. నాయకులు ఈదుల శ్రీనివాస్, పాలకుర్తి వెంకటేశ్, పొన్నవేని స్వామి, పొన్నం కృష్ణ, దేవి కిశోర్, బాబా, బొంగాని సత్యం, ఎల్లయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్ పట్టణంలో ..

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలో మంత్రి వివేక్​బర్త్​డే ఘనంగా నిర్వహించారు.  కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం వద్ద ఆయన అభిమానులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఐఎన్ టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నీరటి శంకర్, అంబేద్కర్ సంఘం  నాయకుడు న్యాతరి శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్లు ధరడే శ్యాం, కరుణాకర్, ఏపీ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ కిశోర్ ఆధ్వర్యంలో మంత్రి అభిమానులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్​అందజేశారు. 

కొత్తపల్లి అనాథ శరణాలయంలో..

జమ్మికుంట, వెలుగు: కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ​అభిమానులు మంత్రి బర్త్​డే సందర్భంగా ఆదివారం కేక్ కట్ చేశారు. అఖిల్, రవి, శ్రీరామ్, మణికంఠ, శ్రీకాంత్ శంతన్, ప్రశాంత్ తదితరులున్నారు.