అరుదైన నమూనాలు.. ఎగిసిపడే రెక్క... పక్షి జాతి ...ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఫెదర్‌

అరుదైన నమూనాలు.. ఎగిసిపడే రెక్క...  పక్షి జాతి ...ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఫెదర్‌

ప్రస్తుతం రిపాజిటరీలో సుమారు 110 నుంచి 160 రకాలకు చెందిన 400లకు పైగా ఎగిసిపడే రెక్కల (ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఫెదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నమూనాలు ఉన్నాయి. ప్రతి నమూనా పక్షి జాతి, వయస్సు, లింగం, అది లభించిన ప్రదేశం వంటి సమగ్ర వివరాలతో నమోదు చేయబడుతుంది. ఫెదర్ లైబ్రరీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ భారతదేశంలో మొదటి దృశ్య ఆధారిత పక్షి రెక్కల డేటాబేస్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందింది. 

ఈ సేకరణకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. అదేంటంటే.. ఇందులో దేశంలో కేవలం ఒకే ఒక్కటిగా నమోదు చేయబడిన సూటీ షియర్‌‌‌‌‌‌‌‌వాటర్ నమూనా ఉండటం. సూటీ షియర్‌‌‌‌‌‌‌‌వాటర్ అనేది సాధారణంగా గుజరాత్ తీర ప్రాంతంలో కనిపించని, అరుదుగా దారి తప్పి వచ్చే సముద్రపు పక్షి. 

రికార్డు విధానం: ఫెదర్ లైబ్రరీలో పక్షి నమూనాలను సేకరించి, భద్రపరిచే విధానంలో అత్యంత కఠినమైన శాస్త్రీయ ప్రమాణాలను పాటిస్తుంది. కేవలం సహజంగా మరణించిన పక్షులనే సేకరించి, రాష్ట్ర అటవీ శాఖల అనుమతితో ఈ ప్రక్రియ జరుగుతుంది.  

జీవసురక్షా నిర్వహణ: పక్షి దొరికిన వెంటనే దానిని 48 గంటల పాటు ఫ్రీజ్ చేస్తారు. దాంతో పరాన్నజీవులు, వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ప్రాథమిక డేటా రికార్డు: ఫ్రీజింగ్ పూర్తయ్యాక పక్షి బరువు, రెక్కల విస్తీర్ణం, తల పొడవు ఇతర శారీరక కొలతలు నిశితంగా రికార్డు చేస్తారు. 

టాక్సిడెర్మీ ప్రక్రియ: పక్షి శరీరాన్ని శాశ్వతంగా భద్రపరచడానికి టాక్సిడెర్మీ ప్రక్రియలను పాటిస్తారు. రెక్కలను మాత్రం శరీరం నుంచి వేరు చేసి, శుభ్రపరిచి, ప్రత్యేకంగా భద్రపరుస్తారు. 

డాక్యుమెంటేషన్: ప్రతి రెక్కను అత్యంత కచ్చితత్వంతో హై–రిజల్యూషన్ స్కాన్‌‌‌‌‌‌‌‌లు చేయిస్తారు. ఈ స్కాన్‌‌‌‌‌‌‌‌లు, రెక్కల నిర్మాణంలోని చిన్న చిన్న వివరాలను కూడా స్పష్టంగా చూపిస్తాయి. ఈ సమాచారాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ డేటాబేస్‌‌‌‌‌‌‌‌లో  కూడా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తారు. ఈ కఠినమైన డాక్యుమెంటేషన్ విధానం వల్ల పరిశోధకులు, విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ విలువైన సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు.  
భవిష్యత్తు లక్ష్యాలు: కేవలం సేకరణకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధన, విద్య, సంరక్షణకు విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో ఫెదర్ లైబ్రరీ పనిచేస్తోంది. భారతదేశంలోని అన్ని పక్షుల రెక్కల నమూనాను ఈ లైబ్రరీలో భద్రపరచడమే ఈషా మున్షీ లక్ష్యం. 

బర్డ్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌: విమానాశ్రయాలలో పక్షులు విమానాలను ఢీకొనే (బర్డ్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌) సంఘటనల తరువాత విమాన శకలాలపై ఉన్న రెక్కల నమూనాలను బట్టి ఏ జాతి పక్షి ఢీకొట్టిందో కచ్చితంగా గుర్తించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. 

చట్టపరమైన ధృవీకరణ: పక్షుల అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టపరమైన కేసుల్లో దొరికిన రెక్కల నమూనాలను పోల్చి చూసి సాక్ష్యాలను అందించడానికి కూడా ఈ డేటాబేస్ ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. 

ఈషా మున్షీ.. ఫెదర్ లైబ్రరీని ఒక ల్యాబ్, మ్యూజియంగా అభివృద్ధి చేసేందుకు నిధులు సమీకరించే పనిలో ఉన్నారు. ఫెదర్ లైబ్రరీ పక్షి శాస్త్ర పరిశోధనలకు ఒక కొత్త, అత్యాధునిక మార్గాన్ని సుగమం చేస్తోంది. భవిష్యత్ తరాల కోసం పక్షి రెక్కల సంపదను భద్రపరుస్తుంది.