రవికృష్ణ, మనికా చిక్కాల జంటగా శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్ రూపొందించిన చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం ఈ చిత్రం నుంచి ‘పిల్లా ’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘దండోరా కొట్టుకుందురో.. గుండెల్లో కొత్తగుందిరో.. నింగి నేల ఇలా.. దారి కుదిరిందెలా.. కళ్లారా చూడబోతినో.. కల్లోలం లాగ ఉంటదే.. దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా.. పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంది. మార్క్ కె రాబిన్ కంపోజ్ చేయగా, పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ రాశారు. అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఇంప్రెస్ చేసింది.
