
హైదరాబాద్, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 న గోల్కొండలో ఉదయం 10.30కు సీఎం కేసీఆర్జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్ర్య సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు. అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.