గోల్డెన్ టెంపుల్లో 15, 16న కృష్ణాష్టమి వేడుకలు

గోల్డెన్ టెంపుల్లో 15, 16న కృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్​లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్​లో కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను ఈ నెల 15, 16న నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరేకృష్ణ మూమెంట్ ప్రకటించింది. రాధా గోవింద, గోదా కృష్ణ, లడ్డూగోపాల్ దర్శనంతో పాటు ప్రత్యేక సేవా కార్యక్రమాలు ఉంటాయని అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూ తెలిపారు. ఆగస్టు 17న నందోత్సవం, వ్యాసపూజ, 56 రకాల నైవేద్యాలతో చప్పన్ భోగం, నరసింహ హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు, హరినామ సంకీర్తన నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.