కేసీఆర్.. నీ ఇంట్లో ఔరంగజేబు పుట్టిండు

కేసీఆర్.. నీ ఇంట్లో ఔరంగజేబు పుట్టిండు

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటానన్న కేసీఆర్ కు.. ఇప్పుడు తెలంగాణ ప్రజలే కుక్కల్లా కనిపిస్తున్నారా అని అన్నారు. జగిత్యాల పొలం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణపై చర్చ జరిగితే సభలో లేని కేసీఆర్…ఎక్కడ తాగి పన్నాడో ఆనాడాయనకే తెలియదన్నారు. ‘కుక్కలకు విశ్వాసం ఉంటది..కానీ, విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్. సీఎం పదవిని ఎవడైనా చెప్పుతో సమానం అంటాడా? చెప్పును పట్టుకుని మరింకా ఎందుకు వేలాడుతున్నావు.. ఇడిసిపెట్టొచ్చు కదా? మళ్ళీ నేనే సీఎం అంటావ్? నీ టైం అయిపొయింది. నీ  ఇంట్లో ముసులం పుట్టుంది.. మొగల్ సామ్రాజ్యం మాదిరిగా నీ ఇంట్లో ఔరంగజేబు పుట్టిండు.. నీకు పదవి ఉండదు.. జాగ్రత్త’ అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

మామిడి, అరటికి తో పాటు హార్టికల్చర్ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు జీవన్ రెడ్డి. మద్దతు ధర కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతన్నారు. ధాన్యం సేకరణ నిలిచిపోతే …బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. పసుపు బోర్డు తో పాటుగా మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి… కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.