మార్ష్‌‌‌‌‌‌‌‌, డేవిడ్ ధనాధన్

మార్ష్‌‌‌‌‌‌‌‌, డేవిడ్ ధనాధన్

వెల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌ : మిచెల్ మార్ష్ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్‌‌‌‌‌‌‌‌)కు తోడు టిమ్ డేవిడ్ (10 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపులతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆస్ట్రేలియా తొలి టీ20లో చివరి బాల్‌‌‌‌‌‌‌‌కు గెలిచింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆరు వికెట్లతో కివీస్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.  

తొలుత కివీస్ 20 ఓవర్లలో 215/3 స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), డెవాన్ కాన్వే (46 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) ఫిఫ్టీలతో మెరిశారు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 216/4 స్కోరు చేసి గెలిచింది. మార్ష్‌‌‌‌‌‌‌‌, డేవిడ్‌‌‌‌‌‌‌‌తో పాటు వార్నర్ (32), మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (25),  ట్రావిస్ హెడ్ (24) కూడా రాణించారు. మార్ష్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.