WTC ఫైనల్‎కు ప్లేయింగ్ 11 ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఫామ్‎లో లేని స్టార్ ప్లేయర్‎కు ఓపెనర్‎గా ప్రమోషన్

WTC ఫైనల్‎కు ప్లేయింగ్ 11 ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఫామ్‎లో లేని స్టార్ ప్లేయర్‎కు ఓపెనర్‎గా ప్రమోషన్

ఇంగ్లాండ్‎లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందు ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ లెవన్‎ను ప్రకటించింది. స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ నేతృత్వంలో ఆసీస్ బరిలోకి దిగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌‎లో ఆస్ట్రేలియా కీలక మార్పు చేసింది. 

మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‎ను ఓపెనర్‎గా ప్రమోట్ చేసింది. లబుషేన్ గతకొంత కాలంగా పేలవ ఫామ్‎తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ డబ్ల్యూటీసీ వరల్డ్ కప్‎లోనూ ఏమంతగా రాణించలేదు. దీంతో అతడికి ఫైనల్ మ్యాచులో చోటు కూడా కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మనం అనుకున్నది చేస్తే అది ఆస్ట్రేలియా ఎందుకు అవుతది..? ఎవరి అంచనాలకు అందని విధంగా ఫామ్‎లోని లబుషేన్‎ను ఏకంగా ఓపెనర్‎గా బరిలోకి దింపాలని నిర్ణయించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‎లో ఉస్మాన్ ఖవాజాతో కలిసి లబుషేన్ ఓపెనర్‎గా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన కామెరూన్ గ్రీన్ కూడా ఫైనల్‎లో బరిలోకి దిగే జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్స్ మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‎గా నాథన్ లియాన్ ఎంపికయ్యాడు. మిచెల్ మార్ష్‌కు బదులుగా  బ్యూ వెబ్‌స్టర్ జట్టులోకి వచ్చాడు. 

ఆస్ట్రేలియా జట్టు ప్లేయింగ్ లెవన్:

ఉస్మాన్ ఖవాజా , మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్

మరిన్ని వార్తలు