ఇండియాతో వైట్ బాల్ సిరీస్‎కు జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా.. టీమ్‎లోకి తిరిగొచ్చిన స్పీడ్ గన్

ఇండియాతో వైట్ బాల్ సిరీస్‎కు జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా.. టీమ్‎లోకి తిరిగొచ్చిన స్పీడ్ గన్

మెల్‎బోర్న్: ఇండియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‎లకు 15 మందితో కూడిన రెండు వేర్వేరు టీములను ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వైట్ బాల్ టూర్‎కు దూరమయ్యాడు. దీంతో మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియాను ముందుండి నడిపించనున్నాడు.

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా పేస్ గన్ మిచెల్ స్టార్క్ భారత్‎తో జరగనున్న వన్డే సిరీస్‎కు తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్‎వెల్ ఈ సిరీస్‎కు దూరమయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా,  జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్ వన్డే, టీ20 రెండు జట్లులో చోటు దక్కించుకున్నారు. 

కాగా, 2025, అక్టోబర్ 19వ తేదీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వైట్ బాల్ సమరం షూరు కానుంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరగనుంది. టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా జరగనున్న వన్డే సిరీస్‎తో పునరాగమనం చేయనున్నారు. దీంతో కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా టీ20 జట్టు (మొదటి రెండు మ్యాచ్‌లు): 

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్ , ఆడమ్ జంపా