
బ్రిస్బేన్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధం ఎదుర్కొని ఆస్ట్రేలియా టీమ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ స్మిత్ సత్తా చాటాడు. వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా న్యూజిలాండ్ లెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్మిత్ అజేయంగా 89 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే, కివీస్ ఆటగాడు విల్ యంగ్ (130) సెంచరీతో చెలరేగడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెవెన్‌కు ఓటమి తప్పలేదు. తొలుత ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 277 రన్స్ చేసింది. స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖవాజా (56), గ్లెన్ మాక్స్‌వెల్ (52 ) రాణించారు. డేవిడ్ వార్నర్ (0) డకౌటయ్యాడు. అనంతరం యంగ్ సెంచరీ, టామ్ లాథమ్ (69 నాటౌట్) హాఫ్ సెంచరీతో కివీస్ 47.2 ఓవర్లలో 283/3 స్కోరు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.