ఆరోసారి విజేతగా ఆసీస్

ఆరోసారి విజేతగా ఆసీస్

కేప్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌:  విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఎనిమిది ఎడిషన్లలో ఆరోసారి విజేతగా నిలిచి ట్రోఫీల ‘సిక్సర్’​ కొట్టింది. వరుసగా మూడోసారి విశ్వవిజేతగా హ్యాట్రిక్​ కూడా సాధించి  అందనంత ఎత్తుకు చేరుకుంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (53 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 74) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో కంగారూలు 19 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాపై గెలిచారు. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 156/6 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (29) ఫర్వాలేదనిపించింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 137/6 స్కోరుకే పరిమితమైంది. లారా వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ట్రయాన్‌‌‌‌‌‌‌‌ (25) కాసేపు పోరాడినా మిగతా వారు విఫలమయ్యారు. మూనీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి.

క్యూ కట్టారు.. 

ఛేజింగ్​లో సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఓ వైపు ఓపెనర్‌‌‌‌‌‌‌‌ వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌  ఒంటరిపోరాటం చేసినా రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సపోర్ట్​ అందలేదు. నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే బ్రిట్స్‌‌‌‌‌‌‌‌ (10) ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో సఫారీలు 22/1 స్కోరు మాత్రమే చేశారు. ఈ దశలో కాప్‌‌‌‌‌‌‌‌ (11) రెండు ఫోర్లు బాదగా, వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌ సిక్సర్‌‌‌‌‌‌‌‌తో జోరు పెంచింది. అయితే 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో కాప్‌‌‌‌‌‌‌‌ వెనుదిరగడంతో.. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 52/2 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సున్‌‌‌‌‌‌‌‌ లుస్‌‌‌‌‌‌‌‌ (2) రనౌట్‌‌‌‌‌‌‌‌కావడంతో 54/3 స్కోరుతో హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో వచ్చిన ట్రయాన్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌ నుంచి వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌ దూకుడు పెంచింది. రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, రెండు ఫోర్లు బాదడంతో 15 ఓవర్లలో 98/3 స్కోరు వచ్చింది. ఇక గెలవాలంటే 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 59 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన దశలో 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ట్రయాన్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టి ఔట్‌‌‌‌‌‌‌‌కాగా, డి క్లెర్క్‌‌‌‌‌‌‌‌ (8 నాటౌట్‌‌‌‌‌‌‌‌),  సినాలో జఫ్తా (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టార్గెట్‌‌‌‌‌‌‌‌ను అందుకోలేకపోయారు. ఆసీస్​ బౌలర్లలో షుట్‌‌‌‌‌‌‌‌, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌, బ్రౌన్‌‌‌‌‌‌‌‌, జొనాసెన్‌‌‌‌‌‌‌‌ ఒక్కో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు.