
కింగ్‌స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో శనివారం రాత్రి ప్రారంభమైన మూడో, డేనైట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో తడబడింది. విండీస్ బౌలర్లు షమర్ జోసెఫ్ (4/33), జేడెన్ సీల్స్ (3/59), జస్టిన్ గ్రీవ్స్ (3/56) చెలరేగడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 70.3 ఓవర్లలో 225 రన్స్‌కే పరిమితమైంది. స్టీవ్ స్మిత్ (48) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (46), ప్యాట్ కమిన్స్ (24), ఉస్మాన్ ఖవాజ (23) మోస్తరుగా ఆడారు.
సామ్ కాన్‌స్టస్ (17)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో నలుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 16/1 స్కోరు చేసింది. బ్రెండన్ కింగ్ (8 బ్యాటింగ్), రోస్టన్ ఛేజ్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కెవ్లాన్ అండర్సన్ (3) నిరాశపర్చాడు. ప్రస్తుతం కరీబియన్ జట్టు ఇంకా 209 రన్స్ వెనకబడి ఉంది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆసీస్ స్టార్ స్పిన్నర్ నేథన్ లైయన్‌ను తొలిసారి తుది జట్టునుంచి తప్పించారు. కంగారూ టీమ్ ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగింది. మిచెల్ స్టార్క్‌కు ఇది వందో టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఫీట్ సాధించిన 16వ ఆసీస్ బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అండర్సన్ వికెట్ తీసిన స్టార్క్... కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయికి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు.