V6 News

చెలరేగిన బౌలర్లు..తక్కువ స్కోరుకే ఆసిస్ ఆలౌట్

చెలరేగిన బౌలర్లు..తక్కువ స్కోరుకే ఆసిస్ ఆలౌట్
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. ఆసిస్ బ్యాట్స్ మెన్ ను తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు పంపడంతో  మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. మొదటి రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసిస్ 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30 మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లు బుమ్రా 4, రవిచంద్ర అశ్విన్ 3,సిరాజ్ 2,జడేజాకు ఒక వికెట్ పడ్డాయి. ఇక తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాద్ యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు.