WTC ఫైనల్‎లో దుమ్మురేపుతోన్న రబాడ.. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్

WTC ఫైనల్‎లో దుమ్మురేపుతోన్న రబాడ.. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్

లండన్: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సమరం మొదలైంది. ఇంగ్లాండ్‎లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచింది. దీంతో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 

సౌతాఫ్రికా స్టార్ పేసర్ రబాడ నిప్పులు చెరగడంతో ఇన్సింగ్స్ స్టార్టింగ్‎లోనే ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‎లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 20 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే రబాడ బౌలింగ్‎లో కీపర్‎కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గాయం కారణంగా చాలా కాలం తర్వాత జట్టులోకి కామెరూన్ గ్రీన్ కూడా నిరాశ పర్చాడు. 

ALSO READ | ఇంగ్లండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌.. రెడ్‌‌ బాల్‌‌ లయపై ఫోకస్‌‌: అర్ష్‌‌దీప్‌‌

ఫస్ట్ డౌన్‎లో బ్యాటింగ్‎కు వచ్చిన గ్రీన్ వచ్చి రాగానే ఫోర్ కొట్టాడు ఊపు మీద కనిపించాడు. కానీ ఆ తర్వాత వెంటనే రబాడ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి గ్రీన్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. క్రీజులో లబుషేన్ (17), స్టీవ్ స్మిత్ (17) ఉన్నారు. 

జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ(కెప్టెన్), పాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్