రెండో టెస్ట్‌‌ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు

రెండో టెస్ట్‌‌ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు

అడిలైడ్‌‌: వెస్టిండీస్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌ (డేనైట్‌‌)లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మార్నస్‌‌ లబుషేన్‌‌ (163), ట్రావిస్‌‌ హెడ్‌‌ (175) దంచికొట్టడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 137 ఓవర్లలో 511/7 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. లబుషేన్‌‌, హెడ్‌‌ నాలుగో వికెట్‌‌కు 297 రన్స్‌‌ జోడించి భారీ స్కోరు అందించారు. అలెక్స్‌‌ క్యారీ (41 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన వెస్టిండీస్‌‌ ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 102/4 స్కోరు చేసింది. టెగెనరైన్‌‌ చందర్‌‌పాల్‌‌ (47 బ్యాటింగ్‌‌), అండర్సన్‌‌ ఫిలిప్‌‌ (1 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. క్రెయిగ్‌‌ బ్రాత్‌‌వైట్‌‌ (19), బ్రూక్స్‌‌ (8), బ్లాక్‌‌వుడ్‌‌ (3), డేవన్‌‌ థామస్‌‌ (19) నిరాశపర్చారు. నీసెర్‌‌ 2 వికెట్లు తీశాడు.