ఆస్ట్రేలియా అండర్‌‌‌‌–19 జట్టులో ఇద్దరు ఇండియన్స్‌‌‌‌

ఆస్ట్రేలియా అండర్‌‌‌‌–19 జట్టులో ఇద్దరు ఇండియన్స్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: ఇండియా సంతతికి చెందిన ఆర్యన్‌‌‌‌ శర్మ, యష్‌‌‌‌ దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌కు ఆస్ట్రేలియా అండర్‌‌‌‌–19 జట్టులో చోటు దక్కింది. వచ్చే నెలలో స్వదేశంలో ఇండియా అండర్‌‌‌‌–19తో జరిగే సిరీస్‌‌‌‌ కోసం ఆసీస్‌‌‌‌ 15 మందితో కూడిన టీమ్‌‌‌‌ను ప్రకటించింది. ఆర్యన్‌‌‌‌ శర్మ విక్టోరియా జట్టులో ప్రధాన బ్యాటర్ కాగా, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ యష్‌‌‌‌ దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ న్యూ సౌత్‌‌‌‌వేల్స్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

ఈ మల్టీ ఫార్మాట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో సెప్టెంబర్‌‌‌‌ 21, 24, 26న బ్రిస్బేన్‌‌‌‌లో మూడు వన్డేలు జరుగుతాయి. సెప్టెంబర్‌‌‌‌ 30 నుంచి అక్టోబర్‌‌‌‌ 3 వరకు బ్రిస్బేన్‌‌‌‌లో, అక్టోబర్‌‌‌‌ 7 నుంచి 10 వరకు  మెక్‌‌‌‌కేలో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌లు ఆడతాయి. 2007 నుంచి 2011 వరకు ఆస్ట్రేలియా మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వ్యవహరించిన టిమ్‌‌‌‌ నీల్సన్‌‌‌‌కు ఇది తొలి అండర్‌‌‌‌–19 సిరీస్‌‌‌‌ అసైన్‌‌‌‌మెంట్‌‌‌‌. 

ఆస్ట్రేలియా లాంగ్‌‌‌‌ టర్మ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ స్ట్రాటజీలో భాగంగా, వైట్‌‌‌‌, రెడ్‌‌‌‌ బాల్‌‌‌‌ ఫార్మాట్లలో యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు ఇంటర్నేషనల్​ అనుభవం రావడం కోసం ఈ సిరీస్‌‌‌‌లను ఏర్పాటు చేశారు. 

జట్టు: సిమోన్‌‌‌‌ బడ్జ్‌‌‌‌, అలెక్స్‌‌‌‌ టర్నర్‌‌‌‌, స్టీవ్‌‌‌‌ హోగన్‌‌‌‌, విల్‌‌‌‌ మలాజ్‌‌‌‌జుక్‌‌‌‌, యష్‌‌‌‌ దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌, టామ్‌‌‌‌ హోగన్‌‌‌‌, ఆర్యన్‌‌‌‌ శర్మ, జాన్‌‌‌‌ జేమ్స్‌‌‌‌, హెడెన్‌‌‌‌ షెల్టర్‌‌‌‌, చార్లెస్‌‌‌‌ లాచ్‌‌‌‌మండ్‌‌‌‌, బెన్‌‌‌‌ గోర్డన్‌‌‌‌, విల్‌‌‌‌ బైరోమ్‌‌‌‌, క్యాసీ బార్టన్‌‌‌‌, అలెక్స్‌‌‌‌ లీ యంగ్‌‌‌‌, జైడన్‌‌‌‌ డ్రాపర్‌‌‌‌. రిజర్వ్‌‌‌‌: జెడ్‌‌‌‌ హోలిక్‌‌‌‌, టామ్‌‌‌‌ పెడింగ్టన్‌‌‌‌, జూలియన్‌‌‌‌ ఒస్‌‌‌‌బోర్న్‌‌‌‌.