ఇన్నాళ్లు దూరంగా ఉన్నట్టే లేదు’ ఆస్ట్రేలియా టీమ్ నుంచి సాదర స్వాగతం అందుకున్న స్టీవ్ స్ మిత్, డేవిడ్ వార్నర్ అన్న మాటలివి. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్, వార్నర్ ఆస్ట్రేలియా వన్డే టీమ్‌లో చేరారు. వీరిద్దరిపై విధించిన ఏడాది నిషేధం ఈ నెల 29తో ముగుస్తుండటంతో వరల్డ్‌కప్ సెలెక్షన్ రేస్ లో ఉన్న ఈ ప్లేయర్లిద్ద రికీ మిగతా ప్లేయర్లు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు . పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రే లియా జట్టు ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. ఐపీఎల్ ఆడేందుకు ఈ ఇద్దరూ ఇండియా బయలుదేరగా ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదేశాలతో దుబాయ్ లో శనివారం ఆసీస్ టీమ్ తో కొంత సమయం గడిపారు . ఈ సందర్భంగా స్మిత్ మాట్లా డుతూ ‘ జట్టు నుంచి లభించిన స్వాగతం చూశాక ఇన్నా ళ్లు టీమ్‌కు దూరంగా ఉన్నాననే భావనే పోయింది. తిరిగి టీమ్ తో కలవడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం టీమ్ కూడా ఉత్సా హంగా ఉంది. ఈ 12 నెలల్లో టీమ్ చాలా మారింది. జట్టులో ఏ స్థా నామిచ్చి నా దానికి న్యాయం చేయడమే ప్రస్తుతం నా ముందున్న అతి పెద్ద సవాల్. ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్‌కప్ , యాషెస్ సిరీస్ లో ఏం జరుగుతుందో చూడాలి’ అని అన్నాడు.
వార్నర్ మాట్లా డుతూ..జట్టు మమ్మల్ని స్వాగతిం చిన తీరు ఆశ్చర్యం కలిగించింది. అందరూ హత్తు కుని వెల్కమ్ చెప్పిన తీరు చూశాక ఇన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నా మనే విషయాన్నే మరచిపోయా. ఇండియాలో గొప్ప విజయం సాధించిన తర్వాత జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పాక్‌తో సిరీస్‌లోను విజయం సాధి స్తారని అనుకుంటున్నా ’ అని అన్నాడు. నిజానికి పాక్‌తో జరిగే ఆఖరి రెండు వన్డేలకు స్మిత్, వార్నర్ ఇద్ద రూ జట్టుకు అందుబాటులో ఉంటారు. రాయల్స్ కు స్మి త్ .. రైజర్స్ తో వార్నర్స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కు రెడీ అయ్యారు. మార్చి 23 నుం చి ప్రారంభమయ్యే ఐపీఎల్ 12వ సీజన్లో స్మిత్ రాజస్థా న్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వార్నర్ సన్ రైజర్స్‌కు ఆడుతున్నాడు. స్మిత్ ఆదివారం ఉదయం జైపూర్ చేరుకోగా, వార్నర్ శనివారం రాత్రే ఇండియాకు వచ్చేశాడు. కొద్ది నెలలుగా ఆటకు దూరమైన స్మిత్ ఆకలిగా ఉన్న పులిలా ఉన్నాడని, అతని రాకతో జట్టు బలం పెరిగిందని రాయల్స్ అంబాసిడర్ షేన్ వార్న్ తెలిపాడు.
Steve Smith and David Warner will have to "prove they are the best players" if they are to return to the Australian set-up, according to Ricky Ponting.
FULL STORY ⬇️https://t.co/hXbBGjhOJa pic.twitter.com/I6DhyQYpl2
— ICC (@ICC) March 18, 2019