తొలి టీ20లో చిత్తయిన ఆసీస్.. ఇండియా గ్రాండ్ విక్టరీ

తొలి టీ20లో చిత్తయిన ఆసీస్.. ఇండియా గ్రాండ్ విక్టరీ
  •     4 వికెట్లతో చెలరేగిన టిటాస్‌‌‌‌‌‌‌‌
  •     దంచికొట్టిన మంధాన, షెఫాలీ 
  •     9 వికెట్ల తేడాతో చిత్తయిన ఆసీస్

నవీ ముంబై : వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ నుంచి వెంటనే తేరుకున్న ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపింది. యంగ్ పేసర్ టిటాస్‌‌‌‌‌‌‌‌ సాధు (4/17) కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు ఓపెనర్లు షెఫాలీ వర్మ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 నాటౌట్‌‌‌‌‌‌‌‌), స్మృతి మంధాన (52 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 54) ఫిఫ్టీలతో దంచడంతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇండియా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.  మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0తో ఆధిక్యం సాధించింది. తొలుత టిటాస్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు ఆసీస్‌‌‌‌‌‌‌‌ 19.2 ఓవర్లలో 141 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.

3ఫోబ్ లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ (49), ఎలైస్ పెర్రీ  (37) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. శ్రేయాంకా పాటిల్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం షెఫాలీ, మంధాన ఆసీస్‌‌పై తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు అత్యధికంగా 137 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించడంతో ఇండియా 17.4 ఓవర్లలోనే 145/1 స్కోరు చేసి గెలిచింది. టిటాస్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది. 

బౌలర్ల జోరు

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా ఫస్ట్ స్పెల్‌‌‌‌‌‌‌‌లో టిటాస్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌ను వణికించింది.  ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరు మీద కనిపించిన బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (17)ని నాలుగో ఓవర్లో పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చి ఇండియాకు తొలి బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హీలీ (8)ని రేణుక ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌ (0), ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో వెనక్కుపంపిన టిటాస్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌ను 33/4తో కష్టాల్లో పడేసింది. ఈ దశలో పెర్రీ, లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ జట్టును ఆదుకున్నారు. వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూ లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ దూకుడగా ఆడగా..

పెర్రీ ఆమెకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దాంతో 13 ఓవర్లకు స్కోరు వంద దాటింది. వన్డేలతో పోలిస్తే ఇండియా ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ మెరుగైనా 27 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేసింది. అయితే, ఫిఫ్టీ ముంగిట ఓ స్లో బాల్‌‌‌‌‌‌‌‌తో లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అమన్‌‌‌‌‌‌‌‌జోత్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆ వెంటనే గ్రేస్ హారిస్ (1) శ్రేయాంకా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. కాసేపు పెర్రీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ (12)ను టిటాస్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. దీప్తి శర్మ ఒకే ఓవర్లో పెర్రీ, మేగన్(1) పని పట్టింది. వారెహమ్‌‌‌‌‌‌‌‌ (5)ను శ్రేయాంకా చివరి వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔట్‌‌‌‌‌‌‌‌ చేసింది.

ఓపెనర్లే కొట్టేశారు

ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు తడబడిన పిచ్‌‌‌‌‌‌‌‌పై ఓపెనర్లు మంధాన, షెఫాలీ చెలరేగడంతో టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఇండియా ఈజీగా ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. రెండో ఓవర్లో షెఫాలీ బౌండ్రీల ఖాతా తెరవగా..  మొదటి రన్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు 12 బాల్స్ ఆడిన మంధాన మూడో ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరు పెంచింది. అక్కడి నుంచి ఇద్దరూ వరుస బౌండ్రీలతో రెచ్చిపోయారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను సద్వినియోగం చేసుకున్న షెఫాలీ.. మేగన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు, సందర్లాండ్ ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టింది. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలోనే 59 రన్స్ రాబట్టింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరూ క్రమం తప్పుకుండా ఫోర్లు రాబట్టారు.

తాలియా మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్ వేసిన 12వ ఓవర్లో షెఫాలీ సిక్స్‌‌‌‌‌‌‌‌, ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  స్కోరు వంద దాటించడంతో పాటు 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆమె సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను అలరించింది. 50 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ దాటిన  మంధాన 16వ ఓవర్లో ఔటవడంతో భారీ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. అప్పటికే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇండియా చేతుల్లోకి రాగా.. షెఫాలీకి తోడైన జెమీమా (6 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విన్నింగ్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టింది. కాగా, మంధాన టీ20ల్లో 3 వేల రన్స్ క్లబ్‌‌లో చేరింది.  హర్మన్‌‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌‌గా నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా : 19.2 ఓవర్లలో 141 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ 49, పెర్రీ 37, టిటాస్ 4/17)

ఇండియా :  17.4 ఓవర్లలో 145/1 (షెఫాలీ 64* , మంధాన 54, వారెహమ్ 1/20)