కోహ్లీ లేకపోతే కంగారూలదే గెలుపు

కోహ్లీ లేకపోతే కంగారూలదే గెలుపు

ఐపీఎల్ పదమూడో సీజన్ ముగిసింది. దీంతో అభిమానులతోపాటు క్రికెట్ ఎక్స్‌‌పర్ట్స్, మాజీ క్రికెటర్ల చూపు ఇంటర్నేషనల్ క్రికెట్ వైపు మళ్లింది. త్వరలో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌‌పై చర్చలు మొదలయ్యాయి. ఆసీస్ టూర్ కోసం టీమిండియా 30 మంది ప్లేయర్లతో జంబో బృందాన్ని సిద్ధం చేసింది. ఈ టూర్‌‌లో టెస్టు సిరీస్ గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. తొలి టెస్టు మినహా మిగతా మూడు మ్యాచులకు దూరమవనున్న కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా గెలుపోటములపై వాన్ పలు వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ లేకపోవడం టీమిండియాకు మైనస్ అవుతుందని, టెస్టు సిరీస్‌‌ను కంగారూలు సులువుగా చేజిక్కించుకుంటారని వాన్ జోస్యం పలికాడు. ‘ఆస్ట్రేలియాతో మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు. పుట్టబోయే బిడ్డను చూడటానికి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయం. కోహ్లీ ఆడట్లేదు కాబట్టి సిరీస్‌‌‌ను‌ ఆస్ట్రేలియా సులువుగా కైవసం చేసుకుంటుంది’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.