Women's ODI World Cup 2025: విశాఖపట్నంలో హై వోల్టేజ్ మ్యాచ్.. ఆస్ట్రేలియాపై ఇండియా బ్యాటింగ్

Women's ODI World Cup 2025: విశాఖపట్నంలో హై వోల్టేజ్ మ్యాచ్.. ఆస్ట్రేలియాపై ఇండియా బ్యాటింగ్

వరల్డ్ కప్ లో టీమిండియా మహిళలు కఠిన పోరుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం (అక్టోబర్ 12) ఆస్ట్రేలియా మహిళలతో కౌర్ సేన కీలక మ్యాచ్ ఆడబోతుంది. విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇండియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించింది. శ్రీలంక, పాకిస్థాన్ పై గెలిచిన టీమిండియా సౌతాఫ్రికాపై ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ లు ఆడితే రెండు గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే టేబుల్ టాప్ లో ఉంటుంది. ఇండియా గెలిస్తే రెండో స్థానానికి చేరుతుంది.   

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI):

అలిస్సా హీలీ (వికెట్ కీపర్, కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగాన్ స్కట్చ్ 

భారత మహిళలు (ప్లేయింగ్ XI): 

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి