ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్: భారత్ ఫీల్డింగ్

ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్: భారత్ ఫీల్డింగ్

మెల్‌‌బోర్న్: బ్యాటింగ్‌ ఫెయిల్యూర్స్‌ నుంచి బయటపడిన టీమిండియా.. మహిళల టీ20 ట్రై సిరీస్‌ టైటిల్‌‌పై కన్నేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో బుధవారం జరుగుతున్న ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత 3 టీమ్స్ నాలుగేసి పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో భారత్, ఆస్ట్రేలియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. మెల్‌‌బోర్న్ వేదికగా నేడు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. కెప్టెన్ లన్నింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

తొలి మూడు లీగ్‌ మ్యాచ్‌ ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హర్మన్‌‌ప్రీత్‌ అండ్‌ కో శనివారం జరిగిన మ్యాచ్‌ లో బ్యాటింగ్‌ లో అదరగొట్టి ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంతో ఇండియా అన్ని డిపార్ట్‌‌మెంట్లలో బలంగా మారింది.  అదే ఊపులో ఆసీస్‌ ను మరోసారి ఓడించి టైటిల్‌‌ నెగ్గడంతో పాటు ఈనెల 21 నుంచి జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌ ముందు కాన్ఫి డెన్స్‌ పెంచుకోవాలని చూస్తోంది. సిరీస్‌ లో 2 టీమ్స్ 2 సార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌ లో గెలిచి సమానంగా ఉన్నాయి.

టీమ్స్ వివరాలు: