ఒకేచోట 24 మందికి అంత్యక్రియలు

ఒకేచోట 24 మందికి అంత్యక్రియలు

ఒకేచోట 24 మందికి అంత్యక్రియలు

మహారాష్ట్ర ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు  

బుల్దానా : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది మరణించగా, 24 మందికి అంత్యక్రియలను అధికారులు ఒకేచోట నిర్వహించారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఆదివారం సామూహిక అంత్యక్రియలు జరిపించారు. బంధువుల సమక్షంలో బుల్దానాలోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు చేశారు. 

‘‘మంటల్లో డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టమైన పని. అందుకు చాలా సమయం పడుతుంది. అందుకే చనిపోయినోళ్ల కుటుంబసభ్యులను ఒప్పించి సామూహిక అంత్యక్రియలు జరిపించినం” అని అధికారులు తెలిపారు. చనిపోయినోళ్లలో ఒకరిని మాత్రం గుర్తించామని, ఆ డెడ్​ బాడీని బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి ప్రైవేట్ బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో 25 మంది కాలిపోగా, మరో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు.