మల్లన్నసాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు

V6 Velugu Posted on Aug 22, 2021

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు అధికారులు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు నీటిని తీసుకువెళ్లే కాల్వ నుంచి కొంతమేర నీటిని వదిలి ట్రయల్ రన్ ను ఆఫీసర్లు పరిశీలించారు. పూర్తి పరిహారం రాకపోవడంతో    గ్రామాల్లోనే ఉన్న కొంత మంది నిర్వాసితులను పోలీసుల సహాయంతో తరలిస్తున్నారు. అర్దరాత్రి బలవంతంగా ముంపు గ్రామాల నుండి  నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.

ఈ నెలాఖరులో గా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసే దిశగా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజులుగా  ముంపు గ్రామాల్లో ఖాళీ అయిన ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తున్న  ఆఫీసర్లు ట్రయల్ రన్ సందర్భంగా రిజర్వాయర్ లోకి స్వల్పంగా నీటిని వదిలి పరిశీలించారు.

Tagged WATER, RELEASE, Authorities, Mallanna Sagar reservoir

Latest Videos

Subscribe Now

More News