ఢిల్లీలో ఆటో అంబులెన్సులు

ఢిల్లీలో ఆటో అంబులెన్సులు

న్యూఢిల్లీ: దేశమంతా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా పేషెంట్లు ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్స్‌‌ కోసమే గంటలు గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఆయన భార్య అనితా సింగ్ కలిసి తమ వంతు సాయంగా సొంత నిధులతో ‘ఆటో అంబులెన్సులు’ ఏర్పాటు చేశారు. వీటిలో ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం. 9818430043/011-41236614 ఈ నంబర్ల ద్వారా ఆటో అంబులెన్స్‌‌ సర్వీస్ వాడుకోవచ్చని సంజయ్ సింగ్ తెలిపారు.
శ్రీనగర్‌‌‌‌లో బోట్ అంబులెన్స్
కరోనా పేషెంట్ల కోసం శ్రీనగర్‌‌‌‌కు చెందిన బోట్ హౌస్ ఓనర్ తారిఖ్ అహ్మద్ పట్లూ దాల్‌‌ లేక్‌‌లో తన బోట్‌‌ను ఇలా అంబులెన్స్‌‌గా మార్చి స్థానికులకు సర్వీస్ చేస్తున్నాడు. ఈ బోట్ అంబులెన్స్‌‌ను డ్రైవ్‌‌ చేస్తున్న వ్యక్తి ఖాళీ టైమ్‌‌లో ఇలా మైక్ పట్టుకుని జనాలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాడు. ఈ మహమ్మారి బారినపడకుండా చేతులు శానిటైజ్ చేసుకోవడం, మాస్కు పెట్టుకోవడం వంటివి పాటిద్దామని పిలుపునిస్తున్నాడు.