నర్సింగ్ స్టూడెంట్​పై ఆటో డ్రైవర్ రేప్

నర్సింగ్ స్టూడెంట్​పై ఆటో డ్రైవర్ రేప్
  • మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి దారుణం 
  • గాయాలతో ఆసుపత్రిలో బాధితురాలు
  • మహారాష్ట్రలో ఘోరం

రత్నగిరి: కోల్‌‌‌‌కతాలో డాక్టర్ రేప్, మర్డర్​పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగానే.. మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్​అత్యాచారానికి గురైంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. మహారాష్ట్ర రత్నగిరిలో నర్సింగ్ స్టూడెంట్(20)​ కాలేజీ అయిపోగానే ఇంటికి బయల్దేరింది. ఆటోలో వెళ్తుండగా మాట కలిపిన డ్రైవర్ ఆమెకు తాగేందుకు నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో మత్తుమందు కలపడంతో అది తాగిన ఆమె స్పృహ కోల్పోయింది.

ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య  ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కొంత సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వారు వచ్చి గాయాలతో ఉన్న ఆమెను హాస్పిటల్​లో చేర్పించారు. ఈ ఘటన రత్నగిరి సిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, ఆస్పత్రి సిబ్బంది, నర్సింగ్ వర్గాలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్​ను అడ్డుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతించాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారు నిరసనలు విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అటో డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.