ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పై ఆటో డ్రైవర్ల దాడి

ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పై ఆటో డ్రైవర్ల దాడి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద బుధవారం రాత్రి మహంకాళి ట్రాఫిక్ పోలీసులపై ఇద్దరు ఆటో కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ సమీపంలో కొద్ది రోజులుగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్​ కు ఇబ్బంది కలుగకుండా రోడ్డుపై ఉన్న ఆటోను అక్కడి నుంచి తీయాలని ఇన్​స్పెక్టర్​ రఘునందన్ చెప్పగా.. ఇద్దరు డ్రైవర్లు ఆగ్రహంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. వీరిని ట్రాస్క్​ ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మార్కెట్ పీఎస్ లో కేసు నమోదైంది.