
హైదరాబాద్ : ఇంటిబయట పెట్టిన బైక్ లు, ఆటోలో టార్గెట్ గా చేసుకుంటారు. తెల్లవారుజామున చోరీ చేస్తారు. కొన్ని నెలలుగా ఉప్పల్, చిలుకానగర్ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు దొంగలు. టూవీలర్ వాహనాలు పోయాయని ఇప్పటికే పలు ఫిర్యాదులు రాగా..దొంగతనాలపై దృష్టి పెట్టారు పోలీసులు. సీసీ కెమెరాలో రికార్డ్ ఆయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు..ఓ ఆటో దొంగిలించిన తీరు కనబడింది. ఆటో పోయిందని ఇటీవల బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అర్థ రాత్రి వాహన దొంగ తనాలకు పాల్పడుతున్న ముఠా కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు.