ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ ల సాధన కోసం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. తాత్కాలికంగా నిలిపివేసిన స్క్రాప్ ప్రక్రియను పునరుద్ధరించాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆటో మీటర్ల ధరలను ఇప్పటివరకు పెంచలేదని గుర్తు చేశారు.
పక్క రాష్ట్రం ఏపీలో ఇస్తున్న వాహన మిత్ర తరహా ... తెలంగాణలో కూడా పథకాన్ని అమలు చేసి10 వేలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రేవేట్ ఫైనాన్షియర్ల దోపిడీని అడ్డుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. తమ డిమాండ్ ల సాధన కోసం ఈ నెల 10న వేలాది మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఛలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు.
