రోడ్డు పక్కన పసికందు.. కాపాడిన ఆటోడ్రైవర్

రోడ్డు పక్కన పసికందు.. కాపాడిన ఆటోడ్రైవర్

మేడ్చల్: రోడ్డు పక్కన కొన్ని వారాల వయసున్న మగబిడ్డను గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలివెళ్లారు. ఈ ఘటన కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని  కీసర అహ్మద్ గూడ ఆర్‌జీకే కాలనీలో చోటుచేసుకుంది. ఆర్‌‌జీకే కాలనీకి వెళ్లే దారి వెంబడి ఓ పసిపాప ఏడుస్తున్న శబ్దాన్ని గమనించిన గుండ్లపల్లి వినయ్ గౌడ్ అనే ఆటో డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పెట్రోల్ మొబైల్ పోలీసులు.. రోడ్డు పక్కన పడిన ఉన్న బాబును తీసుకొని, చుట్టుపక్కల వారిని విచారించారు. ఆ తర్వాత సరైన సంరక్షణ కోసం నాగారంలోని జగతి ఆస్పత్రికి తరలించారు. శిశు సంక్షేమ విభాగానికి కూడా సమాచారం అందించారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వారాల పసిగుడ్డును వదిలిన తల్లిదండ్రుల గురించి విచారణ చేస్తున్నారు.