V6 News

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏవీ రంగనాథ్

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏవీ రంగనాథ్

వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమస్యల గురించి తెలుసన్న ఆయన.. భూసమస్యల్లో జోక్యం చేసుకోమని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 

రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా చేస్తే, రెచ్చగొట్టే విధంగా ఉంటే చట్ట పరంగా చర్యలు తప్పవని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో టార్గెట్ చేసి విమర్శలు చేస్తే కూడా సహించమని చెప్పారు. ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటానన్న ఆయన.. రాజకీయాలకు అతీతంగా సామాన్యుడి సేవే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.