బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో అవతార్‌కు ఆస్కార్‌

 బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో అవతార్‌కు ఆస్కార్‌

ప్రపంచ బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టిన  ‘అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌’ సినిమా బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ గెలుచుకుంది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం విజువల్‌ వండర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. మొత్తం నాలుగు విభాగాల్లో నామినేట్‌ అయింది. ‘బెస్ట్‌ పిక్చర్‌’, ‘బెస్ట్ సౌండ్‌’, ‘బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌’, ‘బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్’లో నామినేట్‌ అయ్యింది. అయితే ఇందులో బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్, బెస్ట్‌ సౌండ్‌ అవార్డులు మిస్‌ అవగా  బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌లో మాత్రం  అవార్డు వరించింది.  బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్స్ట్‌ విభాగంలో ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌’, ‘ది బాట్‌మెన్‌’, ‘బ్లాక్‌ పాంథర్: వకండా ఫరెవర్‌’, ‘టాప్‌గన్ : మావెరిక్‌’ సినిమాలతో పోటీ పడి అవతార్‌ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు గెలుచుకుంది.