IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. బుమ్రా, అక్షర్ దూరం.. కారణం ఇదే!

IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. బుమ్రా, అక్షర్ దూరం.. కారణం ఇదే!

న్యూజిలాండ్ తో శుక్రవారం (జనవరి 23) జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ కు టీమిండియా స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ దూరమయ్యారు. వరల్డ్ కప్ ముందు బుమ్రా, అక్షర్ ఆడకపోవడంతో వీరిద్దరికీ ఏమైందని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. వీరిద్దరూ ఆడకపోవడానికి కారణం లేకపోలేదు. స్టార్ పేసర్ బుమ్రాకు రెండో టీ20 మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. పని భారం కారణంగా బుమ్రాను రెండో టీ20 నుంచి తప్పించారు. వరల్డ్ కప్ సమయానికి బుమ్రాను తాజాగా ఉంచాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. దీంతో బుమ్రా స్థానంలో హర్షిత్ రానాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. మూడో టీ20కి ఈ స్టార్ పేసర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

అక్షర్ కు గాయం: 

స్పిన్ ఆల్ రౌండర్.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం కారణంగా రెండో టీ20కి దూరమయ్యాడు. తొలి వన్డేలో బౌలింగ్ వేస్తున్నప్పుడు రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో అక్షర్ గాయపడ్డాడు. గాయం కావడంతో ఓవర్ మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీంతో మిగిలిన ఓవర్ ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. రెండో టీ20కి అక్షర్ అందుబాటులో లేకపోవడంతో కుల్దీప్ యాదవ్ జట్టులో వచ్చాడు. అక్షర్ గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు కోలుకుంటాడో క్లారిటీ రావడం లేదు. అక్షర్ గాయం తీవ్రమైతే సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

►ALSO READ | IND vs NZ: రెండో టీ20లో టాస్ గెలిచిన ఇండియా.. ప్లేయింగ్ 11 నుంచి బుమ్రా, అక్షర్ ఔట్
 
ఇండియా బౌలింగ్:
 
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రాండ్ విక్టరీ అందుకున్న సూర్యకుమార్ సేన అదే జోరును రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొనసాగించి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–0తో ముందంజ వేయాలని చూస్తోంది.