అయోధ్యకు డైరెక్ట్ విమానాలు.. ఎలా చేరుకోవాలో ట్రావెల్ గైడ్ ఇదే..

అయోధ్యకు డైరెక్ట్ విమానాలు.. ఎలా చేరుకోవాలో ట్రావెల్ గైడ్ ఇదే..

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం యూపీ అయోధ్య ముస్తాబవుతోంది. శ్రీరాముని విగ్రహా ప్రాణప్రతిష్టకు పది రోజులే గడువు ఉంది. దీంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్ పోర్టులో ఏకంగా 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 

దేశీయ విమాన సంస్థలు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్య విమానాలను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర విమాన సంస్థలు కూడా అయోధ్య కు విమానాలు ప్రారంభించే అవకాశం ఉంది. స్పేస్ జెట్ అయోధ్యకు విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది. 

ఈ నగరాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమానాలు 

ఢిల్లీ, ముంబై,కోల్ కతా, బెంగళూరు,అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.. బెంగళూరు- అయోధ్య, కోల్ కతా - అయోధ్య మధ్య 17 విమానాలను ప్రారంభిస్తుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ- అయోధ్య మధ్య విమానాల రాకపోకలను ప్రారంభించింది ఎయిర్ ఇండియా. 

అయోధ్య పున: ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు ఆహ్వానం.. 

ఈ వేడుకలకు రామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబసభ్యులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీ రామ్ ... ఫ్యామిలీ మెంబర్లను కూడా  ఆహ్వానించనున్నారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈ వేడుకలకు హాజరుకానున్నారని VHP ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. 

అయితే, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆరోగ్యం, వయస్సు  దృష్ట్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు అయోధ్యలో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం లేదని రామజన్మభూమి ట్రస్ట్ గత నెలలో తెలిపింది.

అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్ గా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యోగి ఆదిత్యనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్లైట్స్ ల్యాండింగ్ తో  ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని పరిశీలిస్తామని తెలిపారు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఉత్తరప్రదేశ్ కు నాల్గవ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ స్థానం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి థ్యాంక్స్ చెప్పారు.

  • Beta
Beta feature