అయ్యప్ప మాల వేసుకుంటే నో ఎంట్రీనా : స్కూల్ ఎదుట భక్తుల ఆందోళన

అయ్యప్ప మాల వేసుకుంటే నో ఎంట్రీనా : స్కూల్ ఎదుట భక్తుల ఆందోళన

జూబ్లీహిల్స్ స్కూల్ ముందు అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రాంపల్లి దాయర జూబ్లీహిల్స్ స్కూల్ ముందు అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. 

అయ్యప్ప మాల వేసుకున్న మౌతిక అనే విద్యార్థిని ఉపాధ్యాయులు స్కూల్ లోకి అనుమతించలేదు. స్కూల్ యూనిఫాం ఉంటేనే పాఠశాలకు రావాలని ఆదేశించారు.  దీంతో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున స్కూల్ ముందు చేరుకొని ధర్నా చేశారు. అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ కు ఎందుకు రానివ్వరని ఉపాధ్యాయులను నిలదీశారు. కర్రలతో గేటుపై దాడి చేశారు. మౌతికను అవమానపరిచినందకు స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అయ్యప్పలు, అయ్యప్ప భక్తులు హెచ్చరించారు. స్కూల్ ఆవరణలో అయ్యప్ప స్వాములు బయటాయించి.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.